- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల: మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మెప్మా పి.డి. మారుతి ప్రసాద్ లతో కలిసి ఎ.పి.ఎం.లు, మండల సమాఖ్య నాయకులు, కార్యదర్శులు, సభ్యులు, ఆర్.పిలు, సి.ఓ.లు, టి.ఎం.సి.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సూక్ష్మ పరిశ్రమల క్రింద 5 వేల 684 యూనిట్లు ప్రతిపాదించగా.. 90 శాతం గ్రౌండింగ్ జరిగిందని తెలిపారు. ఇందులో మొబైల్ ఫిష్, మిల్క్ పార్లర్లు, మేకలు, గొర్రెలు, కోళ్ళ పెంపకం ఇతర వివిధ రకాల విభాగాలతో వ్యాపార రంగంలో ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. చిన్న వ్యాపారాలతో పాటు బోర్ డ్రిల్లింగ్, కుట్టు మిషన్లు, వ్యవసాయ డ్రోన్లు, ఫ్లయాష్ బ్రిక్, కకూన్ త్రెడ్ తయారీ, పౌల్ట్రీ షెడ్లు వంటి రంగాలలో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రుచికరమైన తెలంగాణ పిండి వంటల తయారీ చేపట్టినట్లయితే శిల్పారామంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు జీవిత భీమా, ప్రమాద భీమా సౌకర్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం స్త్రీ నిధి పథకంలో మందమర్రి టౌన్ లెవల్ ఫెడరేషన్ సంస్థ రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచినందున సంస్థ సభ్యులకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






