నీళ్లు వస్తలేవు.. కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన

by Batti.Sumithra |

మా కాలానికి నీళ్లు రావడం లేదంటూ మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట మహిళలు మంగళవారం బైఠాయించారు.

నీళ్లు వస్తలేవు.. కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
X

దిశ, భీమిని : మా కాలానికి నీళ్లు రావడం లేదంటూ మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట మహిళలు మంగళవారం బైఠాయించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని బారేగూడెం గ్రామంలోని ఎస్సీ కాలానికి చెందిన వార్డు మెంబర్ కోట.మల్లక్క, దుర్గం.వనిత ఇద్దరు మహిళలు అధికారుల కోసం కార్యాలయం మెట్లెక్కారు. గత వారం రోజులుగా నీళ్లు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై అధికారులకు విన్నవించేందుకు నాలుగు రోజులుగా కార్యాలయానికి వస్తున్నట్లు తెలిపారు. మా నాలుగు ఇండ్లకు నీళ్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ కార్యాలయంలో ఉన్న అధికారులు గమనించి లోనికి పిలిచి సమస్యను తెలుసుకున్నారు.

Next Story