ఆర్టీసీ బస్ కింద పడి మహిళ మృతి

by Bhanu |   (  Updated:2025-06-04 13:12:02  IST  )

బస్ ఎక్కే క్రమంలో బస్ కింద మహిళ మృతి చెందిన సంఘటన విషాదం నింపింది.

ఆర్టీసీ బస్ కింద పడి మహిళ మృతి
X

దిశ,పెగడపల్లి : నరసింహునిపేట వద్ద విషాదం చోటుచేసుకుంది. మండలంలోని నరసింహునిపేట గ్రామానికి చెందిన రాజమ్మ అనే మహిళ బస్ ఎక్కే సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందింది. సమాచారం మేరకు రాజమ్మ మండల కేంద్రానికి వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తుండగా, కరీంనగర్ నుండి పెగడపల్లికి వస్తున్న బస్ అక్కడికి చేరింది. బస్ ఎక్కే క్రమంలో ఆమె ముందు భాగం వైపు నుంచి బస్సు దిగి రావడం గమనించలేదు. డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో ఆమె కాలు చక్రాల మధ్య చిక్కుకుంది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story