భూ వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం

by Taduka Kalyani |

తన చిన్న మామయ్య తో భూ వివాదం కారణంగా ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

భూ వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఆసిఫాబాద్ : తన చిన్న మామయ్య తో భూ వివాదం కారణంగా ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని రాజుర గ్రామానికి చెందిన బొట్టుపల్లి మనీషా భూ వాటా కోసం గ్రామంలో పంచాయతీ పెట్టారు. తమకు వారసత్వంఇవ్వాలని భూమి తమకు ఇవ్వాలని మామను పంచాయతీలో కోరగా. అతను నిరాకరించడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి మనీషా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story