నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి Johnson Naik

by Kema Shiva Kumar |   (  Updated:2023-08-23 14:08:03  IST  )

ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి Johnson Naik
X

దిశ, ఖానాపూర్ : ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ టికెట్ పొందిన తరువాత మొదటిసారిగా బుధవారం ఖానాపూర్ కు వచ్చిన జాన్సన్ నాయక్ కు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధనకుర్తి శివాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఖానాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులుంటే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని జాన్సన్ నాయక్ అన్నారు.

తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి పని చేస్తానని, సమస్యలు పరిస్కారం చేస్తానని హామీ ఇచ్చారు. దేశం తెలంగాణ వైపు చూస్తుందని, ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్ర కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, సంతోష్, రాజా గంగన్న, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story