చేతికి వచ్చిన పంట ధ్వంసం చేసిన అడవి పందులు

by Nallavelli.Anjaneyulu |

దిశ ఖానాపూర్ : సాగు భూమి లేక బతుకు దెరువు కోసం విదేశాల్లోకి వెళ్లి అప్పుల పాలయ్యాడు ఓ రైతు. అయితే కౌలుకు రెండు ఎక్కరాల భూమిని వరిసాగు కోసం తీసుకున్నాడు. అందులో

చేతికి వచ్చిన పంట ధ్వంసం చేసిన అడవి పందులు
X

దిశ ఖానాపూర్ : సాగు భూమి లేక బతుకు దెరువు కోసం విదేశాల్లోకి వెళ్లి అప్పుల పాలయ్యాడు ఓ రైతు. అయితే కౌలుకు రెండు ఎక్కరాల భూమిని వరిసాగు కోసం తీసుకున్నాడు. అందులో వరి పంట సాగు చేసుకోగా శనివారం రాత్రి అడవి పందులు చేతుకి వచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ఆదివారం ఉద‌యం ఆ పంటను చూసి ఆ రైతు క‌న్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌ ఖానాపూర్ మండల ప‌రిధిలో చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సూర్జపూర్ గ్రామానికి చెందిన తోకల గంగన్న అనే కౌలు రైతు పొట్ట కూటి కోసం విదేశాల్లో కి వెళ్లాడు. అదృష్టం వరించాక అప్పుల పాలై తిరిగి సొంతూరుకి వ‌చ్చాడు. ఇతరుల భూములను కౌలుకు చేసుకోని జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మేడంపల్లి శివారులో రెండు ఎక‌రాల సాగు భూమిని కౌలుకు తీసుకోని వరి పంట సాగు చేసుకోగా ఆడవి పందులు బీభత్సం సృష్టించాయి. అడ‌వి పందులు ధ్వంసం చేసిన వ‌రి పంట న‌ష్ట‌ప‌రిహారాన్ని అట‌వీ శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని కౌలు రైతు గంగ‌న్న ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు.

Next Story