బాసరలో భద్రతేది?

by Taduka Kalyani |

ఆధ్యాత్మిక క్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. అయినా అధికారులు మాత్రం ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు.

బాసరలో భద్రతేది?
X

ఈ రోజుల్లో చిన్న చిన్న ఆలయాలు, దుకాణాల్లో సైతం భద్రత కోసం సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. కానీ నిత్యం వేలాది మంది వచ్చే బాసర సరస్వతి దేవి ఆలయంలో మాత్రం అలాంటివేమీ కనిపించడం లేదు. దీంతో ఈ ఆలయం, భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. గతంలోనే ఓ సైకో ఆలయంలోకి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రెండు సార్లు దొంగతనం జరిగింది. సరైన భద్రత లేకపోవడంతో ఎవరైనా సంఘ విద్రోహశక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దిశ, బాసర: ఆధ్యాత్మిక క్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ప్రత్యేక రోజులు, ఉత్సవాల సమయంలో అయితే భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అయినా అధికారులు మాత్రం ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. కనీసం ఇక్కడ లగేజీని , మొబైల్ ఆలయం లోకి తీసుకువెళ్లకుండా గుర్తించే మెటల్ డిటెక్టర్లు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఇదే అదునుగా భావించిన అగంతకులు తమ ప్రతాపం ఆలయం పై చూపిస్తున్నారు.

రెండు సార్లు దొంగతనం

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయంలో భద్రత డొల్ల రీత్యా విచ్చలవిడిగా దొంగతనాలు సైకోల వీరంగాల వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో అమ్మవారి ఆలయంలో గల మంత్రాలయం లో లని దత్తాత్రేయ మందిరం లో, బయట లడ్డు కౌంటర్ లో దొంగతనం జరగగా తాజాగా ముగ్గురమ్మలలో ఒకరైన స్వయాన మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టి మరీ కిరీటం, బయట గల హుండీని ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా దొంగిలించిన ఆ హుండీని అక్కడే వ్యాస గుహ వద్ద పగలగొట్టి అందులోని నగదు చోరీ చేసి హుండీ ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ యుగాంతం జరగడానికి పట్టే సమయం దాదాపు ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆలయ భద్రత నిమిత్తం అక్కడే పనిచేస్తున్న హోంగార్డులు, సీసీ కెమెరాలను పర్యవేక్షించేవారు ఏం చేస్తున్నట్లు, ఇలా అర్థం కాని పరిస్థితి బాసర ఆలయంలో నెలకొంది. ఇంతా నిర్లక్ష్యంగా వ్యవహరించిన భద్రత సిబ్బంది ఆలయ అధికారులపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు.

గతంలో కత్తితో అమ్మవారి ఆలయంలోకి...

గతంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ గౌడ్ అనే సైకో కత్తితో అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలో తనకు తాను గాయ పరుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదే సైకో తర్వాత మరోసారి ఆలయంలోకి ప్రవేశించినా భద్రతా సిబ్బంది కనిపెట్టలేకపోయారు. మూడోసారి వచ్చిన ఆ సైకోను ఆలయ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది గమనించి పట్టుకున్నారు. కత్తితో లోపలికి వెళ్ళే సమయంలో ఆలయం వద్ద మెటల్ డిటెక్టర్లు ఉన్నట్లయితే మొదటిసారే అతడిని పట్టుకునే వీలుండేది. మూడు సార్లు ఆలయంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించిన అధికారులు మాత్రం భద్రతా పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. మొదటి సారి తనకు తాను గాయపరుచుకున్నాడు కాబట్టి సరిపోయింది.. భక్తులపై దాడికి పాల్పడితే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాసర ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని గతంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆలయ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

తాత్కాలిక ఉద్యోగితోనే...

తెలంగాణకే తలమానికమైన బాసర ఆలయంలో తాత్కాలిక ఉద్యోగితోనే సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతోంది. అది కూడా అంతంత మాత్రమే. ఈ ఆలయంలోకి గతంలో పంది, సైకో ప్రవేశించినా ఇవేవీ సీసీటీవీలో రికార్డు అప్పట్లో కాలేదని తెలుస్తుంది. కెమెరాల సామర్థ్యం తక్కువగా ఉండడంతో 15 రోజులే రికార్డ్ అయ్యేలా ఉండడంతో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అనుమానితులను గుర్తు పట్టడం కష్టం అవుతోంది. ఏదేమైనప్పటికీ బాసర ఆలయంలో భద్రత డొల్ల ప్రశ్నార్థకంగా మారింది.

జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ

ప్రస్తుత పుణ్యక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల సమయంలో పోలీసులు సైతం తమ సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. దీంతో భద్రత విషయంలో భారీ అంచనాలు ఉన్న, ప్రజలకు దేశంలోనే ప్రముఖ ఆలయమైన బాసరలో చోరీ జరగడం కాస్తంత కలవర పెట్టే విషయమైన ఆలయ అధికారులు, భద్రత సిబ్బంది కాస్తైనా భద్రత పై దృష్టి పెట్టాలని భక్తులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story