- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా.. ఎక్కడంటే?
మా ఊర్లో మద్యం అమ్మకండి మద్యపానానికి వ్యతిరేకంగా మరో పోరు కొమురం భీం జిల్లాలో ప్రారంభమైంది.

దిశ, బెజ్జూర్: మా ఊర్లో మద్యం అమ్మకండి మద్యపానానికి వ్యతిరేకంగా మరో పోరు కొమురం భీం జిల్లాలో ప్రారంభమైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం గురువారం కీలక తీర్మానం చేసింది. వేంపల్లి సర్పంచ్ లెండుగురి.సత్తయ్య అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో గ్రామంలో ఎవరైనా మధ్య అమ్మితే రూ.50 వేల జరిమానా, చెల్లించాల్సి ఉంటుందన్నారు.
అలాగే తాగిన వారు సైతం రూ.10 చెల్లించాల్సి ఉంటుందని పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానం అమలు జరిగితే సిర్పూర్ నియోజకవర్గంలో ఆదర్శ గ్రామంగా వేంపల్లి మారుతుంది. వేంపల్లి గ్రామంలో చాలా కుటుంబాలు మద్యం అలవాట్ల వల్ల ఆర్థికంగా, నష్టపోవడమే కాకుండా, భార్య భర్తల మధ్య గొడవలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దారి తీస్తున్నందున, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇలాంటి తీర్మానం చేసింది.






