- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు.

దిశ, భీమిని: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమిని మండలం లోని రాంపూర్, మల్లిడి, బిట్టూర్ పల్లి గ్రామాల్లో పర్యటించారు. రాంపూర్ గ్రామంలోని ఉపాధి హామీ పనుల కూలీలతో మాట్లాడారు. కూలీలకు 100 శాతం పనులు కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా నీడ, త్రాగునీరు వసతి కల్పించాలన్నారు. మల్లిడి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై వివరాలను సేకరించారు. ఇందిర ఇండ్లను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళల, చిన్నారుల సంఖ్యను తెలుసుకున్నారు. చిన్నారుల ఎత్తు, బరువును దగ్గరుండి పరిశీలించారు. కేంద్రంలో ఉన్న ఆట వస్తువులను గమనించి పిల్లలకు ఆటల పై ఆసక్తి పెంచాలన్నారు. కేంద్రంలో ఉన్న కోడిగుడ్లను పరిశీలించారు. సరుకులను ఇంటికి ఇవ్వకుండా కేంద్రం వద్దే వంట చేసి అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. అక్కడినుండి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రాంపూర్ గ్రామంలోని సర్వేనెంబర్ 107 లో పట్టా, ఇనాం, అసైన్మెంట్ భూమి వివరాలను రికార్డులు పరిశీలించి తాసిల్దార్ కు పలు సూచనలు చేశారు. సమస్యలపై కార్యాలయానికి వచ్చే రైతులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నూతనంగా మంజూరైన స్వయం సహాయక భవనాలకు సర్వే నిర్వహించి స్థలం కేటాయించే విధంగా చూడాలని అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగా.మోహన్, ఏపీఓ సత్యప్రసాద్, ఎంపీ ఓ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కర్నే. మమత శ్రీనివాస్, బండి.శ్రీకాంత్ గౌడ్, రాంటెంకి.దశరథ్ తదితరులు పాల్గొన్నారు.






