గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

by Taduka Kalyani |

గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
X

దిశ, ఉట్నూర్ : గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. బుధవారం ఐటీడీఏ పీవో కార్యాలయంలో కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు పీవోకు కలిసి సమస్యలపై విన్నవించారు. గిరిజనులు తమ పునరావాసానికి సంబంధించిన సమస్యలు, తాము అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల పరిస్థితి, భూముల హక్కులు, జీవనోపాధికి సంబంధించిన ఇబ్బందులపై వివరించారు. పునరావాస ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, సాగు భూముల గుర్తింపు, భూ హక్కుల అంశాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మంద మకరందు మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తోందన్నారు. గిరిజనులు వినిపించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, తదితర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గిరిజనుల పునరావాసానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన అన్నారు . గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల, హక్కుల పరిరక్షణ కోసం ఐటీడీఏ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కార మార్గాలు వేగవంతం అవుతాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు పాల్గొన్నారు.

Next Story