- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయకపోతే మహాధర్నా నిర్వహిస్తాం..
గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేకపోతే మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

దిశ, చెన్నూర్: అక్రమ కేసులు బనాయించి ఆనందం పొందడం కంటే అభివృద్ధి చేసి ప్రజల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకట స్వామికి హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేష్ తో పాటు 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో పెండింగ్లో ఉన్న బస్సు డిపో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమ్మక్క సారక్క భవనం.. 100 పడకల ఆసుపత్రి, మినీ స్టేడియం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు. లేని పక్షంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్న నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు చెన్నూరులో ఫ్యాక్టరీ నిర్మించి నిరుద్యోగులకు 40 వేల ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేశాడని అది ఇప్పటికీ అమలు కాలేదని వారి కుటుంబంలో మాత్రం ముగ్గురికి ఉద్యోగాలు సంపాదించుకున్నాడని ఆయన అన్నారు.
లంచాలు లేనిదే ఎటువంటి పనులు జరగడం లేదు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుందని మంత్రికి మాత్రం అక్రమ ఇసుక దందా కనబడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో లంచాలు లేనిదే ఎటువంటి పనులు జరగడం లేదని ముఖ్యంగా మంత్రి నియోజక వర్గంలో అధికారుల ఇష్ట రాజ్యం రాజ్యం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కేతనపల్లి ప్రజలు మంత్రికి తగిన బుద్ధి చెప్పారని రాబోయే ఎన్నికలలో మంత్రికి గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంత్రి అక్రమ కేసులు బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులపై నియంత పాలన కొనసాగించడం కంటే అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






