- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే బ్రిడ్జి నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తాం : ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద పూర్తిగా కేంద్ర నిధులు రూ.107 కోట్లతో చేపట్టే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం ఎంపీ నగేష్‌తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన అండర్‌బ్రిడ్జి, ఓవర్‌బ్రిడ్జి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిధులతో ఈ పనులను చేపడుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తాను కృషి చేస్తే, ఫ్యాక్టరీని అమ్ముకుంటున్నానని బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారం విషయంలో తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.






