వేమనపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి

by Batti.Sumithra |

ప్రజలందరితో కలిసి ఉంటూ వేమనపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు.

వేమనపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి
X

దిశ, వేమనపల్లి : ప్రజలందరితో కలిసి ఉంటూ వేమనపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. శనివారం ఆయన మండలంలోని సూరారం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని సర్పంచ్ చిడం శ్రీలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం నాగారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ ముల్కల శ్రీలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడైనా ప్రజలు నేరుగా తనను కలవచ్చని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనకు ఎలాంటి వ్యక్తిగత ఆశలు లేవని, ప్రజలతో కలిసి ఉండి గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే మండలానికి అనేక బోరు వెల్ పంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. ముత్తాపూర్ నుండి వేమనపల్లి వరకు డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సుంపుటం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఆ గ్రామం పూర్తిగా అటవీ భూమిలో ఉండటంతో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను త్వరలోనే మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే బెల్లంపల్లి నుంచి వేమనపల్లి, చెన్నూరు వరకు ఆర్టీసీ రింగు బస్సు నడిపేందుకు డిపో మేనేజర్‌తో మాట్లాడుతానని తెలిపారు. ఈ సందర్భంగా 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాబీర్ అలీ, డీసీసీ జనరల్ సెక్రటరీ గాలి మధు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య, సర్పంచులు ఉప్పలపు సాయికృష్ణ, ఆలం లక్ష్మణ్, దుర్గం భాగ్యలక్ష్మి, మడే శ్రీనివాస్, కొట్రంగి శ్రీనివాస్, ఆవులమారి పున్నం, అయిల్లా శ్రీనివాస్ రెడ్డి, కొండి మానస, ఎనగంటి మల్లీశ్వరి, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపీఓ వెంకటేష్, నాయబ్ తహసీల్దార్ సాయికృష్ణ, ఆర్ఐ ఖాలిక్, పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్, సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story