వర్షాకాలంలో వరదల పట్ల అప్రమత్తం : కలెక్టర్ అభిలాష అభినవ్

by Nallavelli.Anjaneyulu |

వర్షాకాలంలో నిర్మల్ పట్టణంలో వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో వరదల పట్ల అప్రమత్తం : కలెక్టర్ అభిలాష అభినవ్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : వర్షాకాలంలో నిర్మల్ పట్టణంలో వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, వర్షాకాలం వరదల నివారణపై చేపట్టాల్సిన‌ చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో వర్షాకాలం అధికంగా ఇబ్బందులు కలిగే ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట కల్వర్టర్లు నిర్మించాలని పేర్కొన్నారు. ముందస్తు పటిష్ట ప్రణాళికల ద్వారా పట్టణంలో వరదల వల్ల నష్టాలను నివారించగలుగుతామని వివరించారు. పటిష్ట చర్యలు చేపట్టి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, తహశీల్దార్ రాజు, మున్సిపాలిటీ డిఈ హరిభువన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story