- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద నీటిలో నిరీక్షణ
by Sridhar Babu |
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
దిశ, భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో తంగళ్లపల్లి గ్రామం వద్ద భీమిని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించింది. కన్నెపల్లి మండలం బొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలీలు ఉదయం పత్తి చేలలో పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ వాగు ఇసుకలో ఇరుక్కుపోయింది. దాంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాగులోనే ట్రాక్టర్ను వదిలి ఒడ్డుకు వచ్చారు. మరికొందరు కూలీలు వాగు నీటి ఉధృతికి ట్రాక్టర్ పైనే ఉండిపోయారు. వాగు నీటి ప్రవాహం తగ్గాక మిగతావారు బయటికి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
- Tags
- floodwaters
Next Story








