- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక అభివృద్ధికి పల్లెలే చిహ్నం.. ఆచరణలో మాత్రం అధ్వానం
పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన కరువై అస్తవ్యస్తంగా మారాయి. పల్లెలు ప్రగతికి మెట్లు, ఆర్థిక అభివృద్ధికి పల్లెలే చిహ్నం అని నాయకులు, అధికారులు అనడమే కానీ ఆచరణలో మాత్రం అధ్వానంగా మారింది.

దిశ కన్నెపల్లి/వేమనపల్లి: పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన కరువై అస్తవ్యస్తంగా మారాయి. పల్లెలు ప్రగతికి మెట్లు, ఆర్థిక అభివృద్ధికి పల్లెలే చిహ్నం అని నాయకులు, అధికారులు అనడమే కానీ ఆచరణలో మాత్రం అధ్వానంగా మారింది. ఏ గ్రామంలో చూసినా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లుపైనే మురుగు నీరు పారుతుండడం, కాలువలు, వీధిలైట్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి జిల్ల వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి క్రమక్రమంగా కుంటుపడుతోంది. గ్రామాలు, మండలాల్లో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, నేడు వారు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని పలువురు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అధికారులను, మండలస్థాయిలో పని చేసేందుకు జిల్లా స్థాయి ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయినప్పటికీ వారు మాత్రం ఆ పంచాయతీలో కానీ ఆ మండలంపై పట్టింపే లేకుండా శాఖ పరమైన విధులను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. అధికారులు పేరుకే తప్పా మండలంలోని జరుగుతున్న మీటింగ్, ప్రజావాణికి సైతం రావడం లేదు. పల్లెల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
పల్లెలు ప్రగతికి మెట్లు, ఆర్థిక అభివృద్ధికి పల్లెలే చిహ్నం అని చదవడంలో బాగుంది. కానీ ఆచరణలో అధ్వానంగా ఉన్నాయి. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం నేటికి కలగానే మారుతున్నాయి. పల్లెల్లో ప్రజాప్రతినిధులు పాలన ముగిసి రోజులు గడుస్తుండడతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లుపై మురుగు నీరు, కాలువలు, వీధిలైట్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణాలు అన్నింటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో అభివృద్ధి క్రమక్రమంగా కుంటుపడుతుంది. పల్లెల్లో పనులు జరగాలంటే పాలకవర్గాలు తప్పనిసరి. అలాంటిది నేడు గ్రామ, మండల స్థాయిలో ఏ రకమైన పాలకవర్గం కూడా అధికారంలో లేదు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ఉండే అన్ని రకాల పాలకవర్గాల గడువు ముగిసి 18నెలలు దాటుతుంది. కాగా, వారి స్థానంలో గ్రామాలు, మండలాల్లో పాలనను చూసేందుకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించినప్పటికీ ప్రత్యేక అధికారులు నేడు ప్రేక్షక పాత్ర కంటే అధ్వానంగా మారిందని పలువురు వాపోతున్నారు.
ప్రత్యేక అధికారులకు పట్టింపేది?
కన్నెపల్లి మండలంలో 15 గ్రామ పంచాయతీలకు, వేమనపల్లి మండలంలో 14 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినా వారు పేరుకే ప్రత్యేక అధికారులు తప్పా పరిపాలన విధులను పట్టించుకోవడం లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని మండలంలో వివిధ శాఖల్లో పని చేసే మండలస్థాయి అధికారిని, మండలానికి ఓ ప్రత్యేక అధికారిగా జిల్లాస్థాయిలో పనిచేసే ఉద్యోగులను నియమించారు. అయినప్పటికీ వారు మాత్రం ఆ పంచాయతీలో కానీ ఆ మండలంపై పట్టింపే లేకుండా శాఖ పరమైన విధులను నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో సమస్యలు అనేకం ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు పంచాయతీ సెక్రెటరీ తప్ప మరే ఇతర అధికారి ముందుకు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మురుగు కాలువల నిర్వహణ, డంపింగ్ యార్డులు, చెత్త సేకరణ, క్రీడా ప్రాంగణాలు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, వన మహోత్సవం, వంటి వాటిపై పట్టించుకునే అధికారులే కరువయ్యారు.
18నెలలు గడుస్తున్నా..
గ్రామపంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు 18నెలల గడుస్తున్నా నేటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. దీంతో గ్రామాలు అన్ని మురుగు కూపంలా అధ్వానంగా తయారయ్యాయి. గ్రామస్థాయిలో పూర్తి పరిపాలన సర్పంచ్ చేతిలో ఉండేది. నేడు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ వారు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి విధులను పక్కనపెట్టి శాఖ పరమైన విధుల పట్లనే శ్రద్ధ చూపుతున్నారు. దీంతో గ్రామపంచాయతీలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఇక మండలస్థాయి, జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక అధికారిగా ఉన్నప్పటికీ వారు పేరుకే తప్ప మండలంలోని జరుగుతున్న మీటింగ్, ప్రజావాణికి సైతం రావడం లేదు. పల్లెల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
నిధులు లేకుండా విధులెలా..?
గ్రామపంచాయతీకి నిధులు లేవన్న సాకుతో గ్రామంలో చెత్త సేకరణ, ట్రాక్టర్ కూడా కొన్ని గ్రామపంచాయతీల్లో కొంతకాలంగా తీయడం లేదు. ట్రాక్టర్ నడవాలంటే డీజిల్ నిర్వహణకు సైతం డబ్బులు లేవని, ట్రాక్టర్లకు చిన్న చిన్న రిపేర్లు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడం, వీధిలైట్ల నిర్వహణ నేడు గ్రామపంచాయతీ సెక్రెటరీలపై భారంగా మారింది. అసలే వర్షాకాలం ఆపై సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే ఓవైపు డెంగ్యూ, మలేరియా జ్వరాలు పంజా విసరుతుంటే ఉంటే పల్లెల్లో పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. దోమల నివారణకు వర్షాకాలంలో పాగింగ్ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ వర్షాకాలం ప్రారంభమై మూడు నెలల్లో గడుస్తున్నా నేటికీ గ్రామపంచాయతీలో ఫాగింగ్ చేయలేదు. గ్రామాల్లో అనేక ప్రదేశాల్లో మురుగు రోడ్లపై నిలువ ఉండి కంపు కొడుతున్న వాటిపై మరమ్మతులను చేసేందుకు పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో మురుగు కూపంలోనే ప్రజలు నివసిస్తున్నారు. పల్లెలు వర్షాకాలంలో బురదమయంగా మారి కంపు కొడుతున్నా ప్రత్యేక అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మొక్కుబడిగా ప్రజావాణి..
ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు మండలస్థాయిలో ప్రతి సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి మొక్కుబడిగా సాగుతుంది. ప్రజావాణికి మండలస్థాయి ప్రత్యేక అధికారులతోపాటు మండలంలో పనిచేసే సగానికి పైగా అధికారులు గైర్హాజరు అవుతున్నారు. ఆ మండలంలో పనిచేసే ఉద్యోగులు ప్రతి సోమవారం ప్రజావాణికి గైర్హాజరైనా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అయిష్టత చూపుతున్నారు.






