- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయాలు ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి...
by Batti.Sumithra |
బెజ్జూర్ మండలంలో ఆలయాలను ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని న్యాయం చేయాలని బెజ్జూర్ మండలం అందుగుల గూడ గ్రామ సర్పంచి కొమరం హనుమంతు ఆధ్వర్యంలో గ్రామస్తులు మల్లన్న గుట్టవద్ద గల ధ్వంసమైన ఆలయాల వద్ద బుధవారం నిరసన తెలిపారు.

X
దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలో ఆలయాలను ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని న్యాయం చేయాలని బెజ్జూర్ మండలం అందుగుల గూడ గ్రామ సర్పంచి కొమరం హనుమంతు ఆధ్వర్యంలో గ్రామస్తులు మల్లన్న గుట్టవద్ద గల ధ్వంసమైన ఆలయాల వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఆలయాలు ధ్వంసం చేసే నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి ఆదివాసీ సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా బెజ్జూర్ ఎస్సై వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయాలు ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయాలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సిడం. సకారం, కోరితే తిరుపతి, రమేష్ ఏనక శ్రీహరి, బానయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






