ఆత్మహత్య చేసుకున్న గ్రామ సర్పంచ్ లహరిక..

by Kodari Anjali |

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరిక ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆత్మహత్య చేసుకున్న గ్రామ సర్పంచ్ లహరిక..
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెన్ ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆగి ఉన్న ట్రాక్టర్ నాగళ్లకు ఢీకొని మరో ప్రమాదం సంభవించింది . ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరిపీల్చున్నారు. ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సర్పంచ్ లహరిక (31)మృతి చెందింది. ఆమెకు భర్త రాజేష్, కొడుకు, కూతురు ఉన్నారు. సర్పంచు లహరిక ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని పోలీసులు విచారణ చేపట్టారు. లహరిక మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్‌లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Next Story