ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా..? PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ అన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 10 వేల

ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా..?  PDSU  రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్
X

దిశ, మంచిర్యాల : విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ అన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం లోని పీడీఎస్ యూ కార్యాలయంలో మంగళవారం విద్యార్థి సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకుండా కాలేజీ మేనేజ్ మెంట్, విద్యార్థులను ఆగం చేసిందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన కాంగ్రెస్ కూడా బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పదివేల కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఉండగా 15 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చెల్లని చెక్కులు ఇచ్చి పరువు తీయగా.. సీఎం రేవంత్ రెడ్డి టోకెన్లు ఇచ్చి పైసలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయి కానీ పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవా అని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. కళాశాలల నిరవధిక బంద్ కు పీడీఎస్ యు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయని యెడల పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్, జిల్లా నాయకులు కే. కార్తీక్, అంజి, అంజి పటేల్ పాల్గొన్నారు.

Next Story