- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కు ఓటువేసిన వీడియో వైరల్...
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కు ఓ అభిమాని ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కు ఓ అభిమాని ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినోద్ కు ఓటు వేసిన వీడియోను నెటిజల్లు ఆసక్తిగా చూడటం కనిపించింది. ఓటు వేసి వీడియోను సదరు అభిమాని ఎలా తీశాడని చర్చ జరుగుతుంది.
పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తో ఎలా వెళ్లాడనేది అంతు చిక్కడం లేదు. పోలింగ్ బూత్ లోకి ఓటర్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యమే ఇందుకు కారణం అన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సెల్ ఫోన్ తో ఓటర్ వెళ్లి చిత్రీకరించడం ఎన్నికల నిబంధనకు పూర్తిగా విరుద్ధం కాగా ఈ సంఘటన పై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Next Story






