- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి : కలెక్టర్
జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల: జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం మండలంలోని అటవీ ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆటవిశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, డిసిపి. భాస్కర్, జైపూర్ ఏసీపీ. వెంకటేశ్వర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సమతుల్యమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాగునీటి పథకం అమృత్ 2.0 పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. అనంతరం కాజీపేట మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులకు విద్యార్థుల శ్రద్ధ తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, అటవీ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






