వామ్మో పులి.. భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్న ప్ర‌జ‌లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లాలోని బెజ్జూర్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వాగు ప్రక్కన పెద్దపులి నడుచుకుంటూ

వామ్మో పులి.. భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్న ప్ర‌జ‌లు
X

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లాలోని బెజ్జూర్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వాగు ప్రక్కన పెద్దపులి నడుచుకుంటూ వెళ్లినట్టుగా అడుగుజాడలను (పగ్ మార్క్స్) అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించడంతో, అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను రక్షించేందుకు, అధికారులు తక్షణమే ప్రజలకు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు ద్వారా గ్రామాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఒంటరిగా బయటికి రావద్దు. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలి.


పంట పొలాలకు గుంపులుగా వెళ్లాలి పంట పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తప్పనిసరిగా గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలి. సాయంత్రం 4 గంటలలోపే ఇళ్లకు చేరుకోవాలి. చీకటి పడే వరకు పొలాల్లో ఉండకూడదు. పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి లేదా వాగు పరిసర ప్రాంతాల్లోకి తమ పశువులను మేతకు తీసుకువెళ్లడం పూర్తిగా నిలిపివేయాలి. పులి సంచారం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలి. అటవీశాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలు భయాందోళన చెందకుండా, అధికారుల సూచనలను తప్పక పాటించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story