- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడల్లో మెరిసిన ఉట్నూర్ విద్యార్థులు.. ఎమ్మెల్యే ప్రోత్సాహం
ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర క్రీడా పాఠశాల విద్యార్థులకు బుధవారం క్రికెట్ కిట్స్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు.

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర క్రీడా పాఠశాల విద్యార్థులకు బుధవారం క్రికెట్ కిట్స్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఇటీవలే జరిగిన సీఎం క్రీడా కప్ పోటీల్లో విజేతలుగా నిలిచి సీఎం రేవంత్ రెడ్డితో కప్ అందుకున్న ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభచాటి రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరికలు..
జన్నారం మండలం టీజీ పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ఆధ్వర్యంలో క్యాంపు ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వానికి ఆకర్షితులై, అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల, మత, బేధాలు లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి సమాజంలో ప్రజల శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెరికా సంఘ మండల అధ్యక్షులు కనగంటి శివలింగు, టీజీ పల్లి ఉపసర్పంచ్ మేర విలాస్, వార్డ్ సభ్యులు కోడియేసు, సురవ్వ, మౌనిక, రమేష్, లింగన్న, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి చంద్రయ్య, రవి, దూట రాజేశ్వర్, కోడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






