- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి బ్లాక్ మార్కెట్ కు యూరియా
by Elthuri vijay kumar |
శుక్రవారం అర్ధరాత్రి సిర్పూర్ టి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో ఓ ప్రైవేట్ డీలర్ కు సంబంధించిన యూరియా లారీ అన్ లోడ్ చేసి.. రైతులకు పంపిణీ చేస్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా లారీని సీజ్ చేసి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.

X
అర్థరాత్రి బ్లాక్ మార్కెట్ కు యూరియా
కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఓ ప్రైవేట్ డీలర్
లారీని సీజ్ చేసిన పోలీసులు
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతకొంత కాలం నుంచి యూరియా లభించక జిల్లా రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరికొందరు డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్ రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే తరహాలో శుక్రవారం అర్ధరాత్రి సిర్పూర్ టి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో ఓ ప్రైవేట్ డీలర్ కు సంబంధించిన యూరియా లారీ అన్ లోడ్ చేసి.. రైతులకు పంపిణీ చేస్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా లారీని సీజ్ చేసి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అర్థరాత్రి లారీ ద్వారా యూరియా పంపిణీ చేయడం వ్యవసాయ శాఖ అధికారులు పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






