సిర్పూర్ టీ లో కలకలం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆసిఫాబాద్ : ఓటమి జీర్ణించుకోలేక ఓ ప్రత్యర్థి భర్త గెలుపొందిన సర్పంచ్ భర్త పై వేట కొడవలితో దాడి

సిర్పూర్ టీ లో కలకలం..!
X

దిశ, ఆసిఫాబాద్ : ఓటమి జీర్ణించుకోలేక ఓ ప్రత్యర్థి భర్త గెలుపొందిన సర్పంచ్ భర్త పై వేట కొడవలితో దాడి పాల్పడిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో కలకలం రేపింది. సిర్పూర్ టీ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామ పంచాయతీ కు ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వాడై తాను బాయి గెలుపొందగా.. ప్రత్యర్థి భర్త మొహర్లే భీం రావు ఓటమి జీర్ణించుకోలేక సోమవారం ఉదయం సదరు మహిళ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమె భర్త పోశేట్టిపై వేట కొడవలితో దాడికి యత్నించగా ఆయన తృటిలో తప్పించుకున్నారు. గ్రామస్తులు గమనించి దాడి యత్నించిన భీం రావు అడ్డుకుని..తాడుతో బంధించి చితకబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ తరహాలో గెలుపొందిన అభ్యర్థి పై ప్రత్యర్థి దాడికి యత్నించడం ఇది జిల్లాలో రెండు సంఘటన..మొదటి విడతలో కెరమెరి మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా గెలిచిన రాథోడ్ పుష్పలత పై ప్రత్యర్థి దిలీప్ కాటే ఆమె గొడవతో దాడికి యత్నించగా ఆమె తృటిలో తప్పించుకోగా సదరు మహిళ సర్పంచ్ మామకు గాయాలయ్యాయి.

Next Story