బెల్లంపల్లిని ఎన్నటికీ మర్చిపోలేం..

by Disha Web Desk 20 |
బెల్లంపల్లిని ఎన్నటికీ మర్చిపోలేం..
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైలుగా ప్రజల సహకారంతో సమర్ధవంతంగా పనిచేయడం ద్వారానే తమకు గుర్తింపు వచ్చిందని, ఎస్పీలుగా పదోన్నతి లభించిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిలు అన్నారు. ఆదివారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వారికి కంభంపాటి శ్రీనివాస్ నేహ దంపతులు, సాడి స్వతంత్రరెడ్డి, మేడి పున్నం చెంద్రులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్పీలను సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్లంపల్లి అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్ లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, సజ్జన్నార్, మహేష్ భగవత్ లాంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు బెల్లంపల్లిలో విధులు నిర్వహించారని తెలిపారు. వారి పర్యవేక్షణలో బెల్లంపల్లిలో పనిచేసామన్నారు. నాడు ఉన్న నక్సలైట్ల కార్యకలాపాలు ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం చేస్తూ బెల్లంపల్లిలో బ్రతకడమే దిన దిన గండంగా ఉండేదని వారు గుర్తు చేశారు.

బెల్లంపల్లిలో పనిచేయడం తమకు జీవితంలో ఎంతో సంతృప్తి నిచ్చిందని బెల్లంపల్లిలో పనిచేసినందునే తాము ఎస్పీలుగా ఉద్యోగంలో ఐపీఎస్ లుగా ర్యాంక్ సాధించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నామన్నారు. నక్సలైట్ల కార్యకలాపాలు బెల్లంపల్లిలో ఉదృతంగా ఉండేవన్నారు. ఆ సమయంలో బెల్లంపల్లిలో పోలీసు ఉద్యోగం చేయడం అనేది కత్తిమీద సాము లాంటి దన్నారు. ఇక్కడి ప్రజలు వ్యాపారులు అందించిన సహకారంతోనే పోలీసు ఉద్యోగం సమర్థవంతంగా చేసినట్లు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణి కుంట్ల ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జైపూర్ గోదావరిఖని ఏసీపీలు నరేందర్, గిరి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, బెల్లంపల్లి వన్టౌన్ రూరల్, తాండూర్ శ్రీరాంపూర్ సిఐలు ముస్కేరాజు కోట బాబురావు, బి రాజు, కె జగదీష్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోశలింగం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజి, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రాజులాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిలువేరి నర్సింగం, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కుంభాల రాజేష్, ప్రముఖ వ్యాపారవేత్తలు అజయ్ లోయ బాలాజీ సోనీ, రామ్ మనోజ్ సోని, కొడిప్యాక విద్యాసాగర్, రేణిగుంట్ల శ్రీనివాస్, బాల సంతోష్, కొత్తపల్లి నర్సింగం, వ్యాపారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed