పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య

by Disha Web Desk 11 |
పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య
X

దిశ , సూర్యాపేట : ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామనుకున్న యువ జంట పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషాద ఘటన జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (26), సమీపంలోని కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన సళ్లగుండ నాగజ్యోతి (24) లు గత 5 సంవత్సరాల నుండి ఒకరికి ఒకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని తమ ఇంటి పెద్దలను ఆశ్రయించగా కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. అందుకు మనస్తాపానికి గురైన ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed