తిలక్‌ వల్లే ఓడిపోయామని హార్దిక్ కామెంట్.. ‘నువ్వేం పొడిచావ్’ అంటూ ఫ్యాన్స్ సీరియస్

by Disha Web Desk 2 |
తిలక్‌ వల్లే ఓడిపోయామని హార్దిక్ కామెంట్.. ‘నువ్వేం పొడిచావ్’ అంటూ ఫ్యాన్స్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చూస్తున్న క్రీడాభిమానులకు ముంబై ప్లేయర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ విరోచితంగా పోరాడారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 258 పరుగుల భారీ లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ కేవలం పది పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు చేసి.. చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్షర్ వేసిన 8వ ఓవర్లో తిలక్ వర్మ నాలుగు సింగిల్స్ మాత్రమే తీశారు. లెఫ్ట్ హ్యాండర్ స్పిన్ వేస్తున్నప్పుడు తిలక్ షార్ట్స్ ఆడకుండా సింగిల్స్ తీయడంతోనే ముంబై ఓడిపోయిందనన్నారు. తిలక్‌కు ఆట పట్ల అవగాహన లేకపోవడంతోనే ఇలా జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్ధిక్‌పై విరుచుకుపడుతున్నారు. మరి నువ్వు ఏం పొడిచావ్ అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. చక్కగా రాణిస్తున్న యువ క్రికెటర్‌ను నిందించడం ఎంత వరకు సబబు అనేది హార్దిక్‌కే తెలియాలంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.



Next Story

Most Viewed