అక్కడ ఆ పూజలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంయుక్తా మీనన్.. పెళ్లి చేసుకోబోతుందా?

by Disha Web Desk 6 |
అక్కడ ఆ పూజలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంయుక్తా మీనన్.. పెళ్లి చేసుకోబోతుందా?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత డెవిల్, బింబిసార వంటి వాటిల్లో నటించింది. 2023లో సాయి ధరమ్ తేజ్ సరసన వీరూపాక్షలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేస్తుంది. ఈ క్రమంలో సంయుక్తా మీనన్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది.

తాజాగా, ఈ అమ్మడు షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలా సింపుల్ లుక్‌లో ఉండి స్పెషల్ పూజలు చేస్తూ దొరికిపోయింది. అస్సోం కామాఖ్య దేవి ఆలయంలో సంయుక్త ప్రత్యేక పూజలు చేసింది. అయితే ఇందులో చాలా మంది పెళ్లి కాని వారు వివాహం జరగాలని పెళ్లయిన వాళ్లు పిల్లలు పుట్టాలని పూజలు చేస్తారు. అలాంటిది ఇప్పుడు సంయుక్త ఆ ఆలయంలో కనిపించడంతో ఆమె పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.

అయితే నిజానికి ఈ అమ్మడు నాలుగు శక్తి పీఠంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ఆలయంలో బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చి కెరీర్‌ బాగుండాలని పూజలు చేసినట్లు సమాచారం. తనకంతా మంచి జరిగాలని కోరుకుంటూ కామాఖ్య ఆలయానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ ఆలయాన్ని పలువురు సినీ ప్రముఖులు.. స్టార్ హీరోయిన్లు తమన్నా, రష్మిక, డింపుల్ హయాతీ కెరీర్ కోసం పూజలు చేశారు. ఇప్పుడు వారిని ఫాలో అవుతూ సంయుక్త కూడా ప్రత్యేక పూజలు చేసినట్లు టాక్.



Next Story

Most Viewed