- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు బైకులు ఢీ.. అరగంట అయినా రాని అంబులెన్స్..!
దిశ, రామకృష్ణాపూర్ : రెండు బైకులు ఢీ కొట్టుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్

దిశ, రామకృష్ణాపూర్ : రెండు బైకులు ఢీ కొట్టుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాగిడి జాతీయ రహదారి భీమా గార్డెన్ వద్ద మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో వెళ్తున్నా.. కాసిపేట మండలం యాపా ప్రాంతానికి ఆంజనేయులు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ద్విచక్ర వాహనంతో అతి వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రెడ్డి చేతులకు, కాలికి గాయాలయ్యాయి. ఆంజనేయులుకు మాత్రం తలకు గాయం అవ్వడంతో రక్త స్రావం జరిగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే గుమికూడిన జనాలు 108 అంబులెన్స్ కి ఫోన్ చేసిన 30 నిమిషాల వరకు అంబులెన్స్ రాకపోవడం జాతీయ రహదారి పైనే ఇలాంటి పరిస్థితి ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం ఆంజనేయులును మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






