చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి : తుడుందెబ్బ నాయకులు

by Ratna Kumari |

దిశ, ఉట్నూర్ : ఆదివాసీ బచావో.. లంబాడా హటావో.. అనే ప్రధాన నినాదంతో చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, జిల్లా

చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి : తుడుందెబ్బ నాయకులు
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసీ బచావో.. లంబాడా హటావో.. అనే ప్రధాన నినాదంతో చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, జిల్లా సార్ మేడి మెస్రం దుర్గు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏళ్లుగా ఏజెన్సీలో నివసించే ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు వలస లంబాడీలు హరించుకోపోయారని ఆరోపించారు. దీని ద్వారా ఆదివాసీలు అన్నింటిలో అభివృద్ధి దూరంగానే ఉన్నారన్నారు. చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనీ నవంబర్ 23న ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో ఆదివాసీ సమాజం తరలివచ్చీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, పెద్దలు సెడ్మాకి రామారావు, రాయి సిడం, ఉయిక సుదర్శన్, ముకడే విష్ణు, సిడం జంగు దేవ్, కనక గణేష్, మాడవి ఆనంద్, మెస్రం మనిక్ రావు, నైతం చిత్రు, పూర్క చిత్రు, ఆడ శ్రీరామ్, పెందోర్ త్రిమూర్తి పాల్గొన్నారు.

Next Story