టీయూసీఐ 140వ మే డే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

by Ratna Kumari |

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా.( టీయూసీఐ) ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా, లక్ష్మణచాంద మండలం, వడ్యల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీలో 140వ మేడే పోస్టర్లను విడుదల చేశారు.

టీయూసీఐ 140వ మే డే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ
X

దిశ, లక్ష్మణచాంద : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ( టీయూసీఐ) ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా, లక్ష్మణచాంద మండలం, వడ్యల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీలో 140వ మేడే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా (టీయూసీఐ)జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గంగన్న మాట్లాడుతూ చికాగో నగరన చిందిన రక్తం కాలువలై ప్రవహించే నగరవీధుల్లో జెండాలేరుపెక్కినాయి. ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలని పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన రోజే మేడే 1886 సంవత్సరంలో మే 01న శ్రామిక వర్గ కార్మిక వర్గ పోరాట దినంగా పాటించాలని కార్మిక నాయకుల త్యాగంతో రక్త తరపనతో ఎరుపెక్కిన జెండానే సుత్తి కొడవలి జెండా కార్మిక జెండా ఆ పోరాట ఫలితమే అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎనిమిది గంటల పని దినం అమలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పని భారానికి పని గంటల పెంపున‌కు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. భారతదేశంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, పరిశ్రమల్లో షాపింగ్ మాల్స్, స్విగ్గి, జోమాటోలలో ఉద్యోగులకు ఇతర రంగాలలో పని చేస్తున్న శ్రమజీవులకు 10 గంటల పని చేయించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేసింది శ్రమ దోపిడిని తీవ్రం చేసింది. వేతనాలు తగ్గింపు ఉద్యోగ భద్రత లేకపోవడం సామాజిక భద్రత ఏర్పడింది. మేడే స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. దేశాలలో ఉన్నటువంటి కార్మిక కర్షకుల జీవనోపాధిపై ఆర్థిక ఒత్తిడికి గురయ్యే విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారని ఈ దృశ్చర్యలకు వ్యతిరేకంగా ఈ పాలకుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పని చేయాలని సామ్రాజ్యవాదం పాలిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక శక్తులు మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగన్న, ఆశన్న, రవి, లక్ష్మి పాల్గొన్నారు.

Next Story