ప్రసవవేధనతో గిరిజన మహిళా, శిశువు మృతి

by Ratna Kumari |

దిశ‌, ఉట్నూర్ : పురుటి నొప్పులతో బాధపుడుతున్న ఓ గిరిజన మహిళ ప్రసవ వేధనలో కవల‌లకు జన్మనిస్తున్న సమయంలో ఆ మహిళ ప్రాణాలను విడిచిన ఘటన ఉట్నూర్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి

ప్రసవవేధనతో గిరిజన మహిళా, శిశువు మృతి
X

దిశ‌, ఉట్నూర్ : పురుటి నొప్పులతో బాధపుడుతున్న ఓ గిరిజన మహిళ ప్రసవ వేధనలో కవల‌లకు జన్మనిస్తున్న సమయంలో ఆ మహిళ ప్రాణాలను విడిచిన ఘటన ఉట్నూర్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ టెకం జంగుబాయి (37)కి సోమవారం ఉదయం పురుటి నోప్పులతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే రోడ్డు సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులతో కలసి ఆటో సహాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి మార్గమద్యంలోనే ఆటో చేడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో తీరిగి కుటుంబ సభ్యులు ఆ మహిళను గ్రామానికి తరలించారు. గ్రామానికి తరలించిన వెంటనే మహిళకు పురుటినోప్పులు ఎక్కువ కావడంతో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఒక శిశువు ప్రాణాలతో ఉండగా మరో శిశువుతో పాటు ఆ తల్లీ అస్వస్థతతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంటనే శిశువును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ విషయమై అడిషనల్ డీఎంహెచ్ఓ మనోహర్ ని వివరణ కోరగా.. ఈ సంఘటన నా దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం నేను సేలవులో ఉన్నానని, ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నమని త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని సమాధానం చెప్పారు.

Next Story