అడ‌వి పంది మాంసం ర‌వాణా.. 8 మంది పై కేసు న‌మోదు

by Ratna Kumari |   (  Updated:2025-10-21 14:51:53  IST  )

దిశ‌, బెజ్జూర్ : అడ‌వి పంది మాంసం ర‌వాణా చేస్తున్న వ్య‌క్తుల‌పై కేసు న‌మోదైన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎఫ్ఆర్ఓ ముస‌వీర్ తెలిపిన వివ‌రాల

అడ‌వి పంది మాంసం ర‌వాణా.. 8 మంది పై కేసు న‌మోదు
X

దిశ‌, బెజ్జూర్ : అడ‌వి పంది మాంసం ర‌వాణా చేస్తున్న వ్య‌క్తుల‌పై కేసు న‌మోదైన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎఫ్ఆర్ఓ ముస‌వీర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రాణ‌హిత చెరువు ప‌రిస‌ర ప్రాంతాల నుంచి బెజ్జూర్ మండ‌లం పాప‌న్న‌పేట గ్రామానికి చెందిన నలుగురు, త‌లాయి గ్రామానికి చెందిన న‌లుగురు అడ‌వి పంది మాంసం తీసుకువ‌స్తుండ‌గా త‌లాయి స‌మీపంలో అట‌వీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో వారి వ‌ద్ద ఉన్న మాంసంను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది పై కేసు న‌మోదు చేశారు. అడ‌వి పందిని ఎవ‌రైనా చంపినా.. ఎవ‌రైనా అక్ర‌మ ర‌వాణా చేసినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు ఎఫ్ఆర్ఓ ముస‌వీర్. అడ‌వి పందిని ఎవ‌రు చంపార‌నే కోణంలో వీరిని విచార‌ణ చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు.

Next Story