- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. యంత్రంలో పడి వ్యక్తి మృతి
దిశ, కుబీర్ : కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన మండల పరిధిలోని సాంవ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి వెల్లడించిన వి

దిశ, కుబీర్ : కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన మండల పరిధిలోని సాంవ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సాంవ్లీ గ్రామానికి చెందిన సోం నాథ్ (34) సోయ పట్టే యంత్రంతో సోయా పడుతుంటాడు. శుక్రవారం గ్రామానికి చెందిన సంతోష్ చేనులో సోయ పట్టేందుకు వెళ్లాడు. యంత్రంలో ఇరుక్కొని మృతి చెందాడు. ముఖ్యంగా తన కుటుంబానికి జీవనాధారమైన యంత్రాన్ని నమ్ముకున్నాడు. కానీ ప్రమాదవశాత్తుగా యంత్రంలో చిక్కుకున్నాడు. కాళ్ళు, నడుము, తల భాగాలు, తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య రుక్మాబాయికి సమాచారం ఇచ్చాడు. తీవ్ర గాయలతో ఉన్నాడు. బైoసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. నమ్ముకున్న వృత్తి బలి తీసుకున్నట్లయిందని కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి. భార్య రుక్మాబాయి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనేనని ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు.






