సమక్క గ్రామంలో విషాదం.. మూడు రోజుల్లో దంపతులు మృతి

by Jakkula.Mamatha |

ఇంద్రవెల్లి మండలం సమక్క గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

సమక్క గ్రామంలో విషాదం.. మూడు రోజుల్లో దంపతులు మృతి
X

దిశ, ఉట్నూర్: ఇంద్రవెల్లి మండలం సమక్క గ్రామానికి చెందిన కోరెంగ మాన్కుబాయి, దేవరావు దంపతులు అనారోగ్యంతో మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క- భుజంగరావు దంపతులు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు సుగుణక్కకు బంధువులు కావడంతో ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుగుణక్క వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Next Story