- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పర్యటనకు ట్రాఫిక్ ఆంక్షలు
పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

దిశ, బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సభ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతాయని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ మార్పులు ఇలా..
ఇచ్చోడ నుండి పిప్పిరి గ్రామం వరకు సభకు వెళ్లే వాహనాలకు “వన్ వే” విధానం అమలు చేస్తుంది. నిర్మల్ వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి → బోథ్ ఎక్స్ రోడ్ → పోచ్చరా ఎక్స్ రోడ్ → సోనాల → బజార్హత్నూర్ → పిప్పిరి మార్గం ద్వారా చేరుకోవాలి. అడేగాం, పిప్పిరి, గిర్నూర్ గ్రామాల ప్రజలు ఆదిలాబాద్, నిర్మల్ వైపు వెళ్లాలంటే బజార్హత్నూర్ – బోథ్ మార్గం ఉపయోగించాలి.
ద్విచక్ర వాహనాలు, ఆటోల కోసం ప్రత్యేక మార్గం సభకు వచ్చే ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇచ్చోడ బస్టాండ్ → దిగ్నూర్ → గంగాపూర్ → లక్ష్మీనాయక్ తండా → పిప్పిరి సభాస్థలం మార్గం ద్వారా వెళ్లాలి.
పార్కింగ్ పై కఠిన నిబంధనలు...
అన్ని వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలి గ్రామాల్లో, రోడ్ల పై వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటారు.
గ్రామ ప్రజలకు సూచనలు..
ఆడేగాం, పిప్పిరి, గిర్నూర్ గ్రామాల ప్రజలు పశువులను రోడ్లపైకి రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 8 గంటలలోపు వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.
భద్రత కోసం సహకారం కోరిన పోలీసులు..
ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం నుంచి సభ ముగిసి వాహనాలు వెళ్లే వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం కోసం తీసుకున్న ఈ చర్యలకు అందరూ సహకరించాలని, పోలీసులకు తోడ్పాటు అందించాలని డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






