- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిర్యాణి కైరిగూడలో పులి సంచారం కలకలం
by Bhanu |
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం కలవరం సృష్టిస్తోంది. గడలపెల్లి రహదారి సమీపంలో పులి అడుగులను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం కలవరం సృష్టిస్తోంది. గడలపెల్లి రహదారి సమీపంలో పులి అడుగులను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రలను పరిశీలించగా, అవి పులివేనని నిర్ధారించారు.
తదుపరి చర్యగా, పులి కదలికల ట్రాకింగ్‌కు అటవీ శాఖ రంగంలోకి దిగింది. పులి సంచారం ఉన్న నేపథ్యంలో, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తే ఒంటరిగా కాకుండా సమూహంగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి వలయాన్ని పసిగట్టి, ప్రజలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






