ఇటిక్యాల ప‌హ‌డ్ లో పులి సంచారం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండ‌లం ఇటిక్యాల ప‌హాడ్ లో పులి ఆదివారం క‌నిపించింద‌ని స్థానికులు తెలిపారు. పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ

ఇటిక్యాల ప‌హ‌డ్ లో పులి సంచారం
X

దిశ‌, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండ‌లం ఇటిక్యాల ప‌హాడ్ లో పులి ఆదివారం క‌నిపించింద‌ని స్థానికులు తెలిపారు. పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇటిక్యాలపాడు ప్రాంతం ఎడారిగా ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయడంతో పులుల ఆవాస కేంద్రంగా మారింది. పక్కనే తడోబా అటవీ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతం నుంచి ఇటిక్యాల పహాడ్ కు పులి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం పులుల ఆవాస కేంద్రంగా మారిందని గ్రామస్తులు తెలిపారు. సిరిపుర్ టి రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో పులి కదలికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇటిక్యాల పహాడ్ ప్రాంత ప్రజలు బయటికి వెళ్లొద్దని మాకిడి ఫారెస్ట్ సెక్షన్ అధికారి వల్క మోహ‌న్ రావు తెలిపారు.

Next Story