- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పై అపోహలు వద్దు : డీఎఫ్ వో నీరజ్ కుమార్
జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పై అపోహలు వద్దని డీఎఫ్ వో నీరజ్ కుమార్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు.

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పై అపోహలు వద్దని డీఎఫ్ వో నీరజ్ కుమార్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి మన జిల్లా టైగర్ కారిడార్ గా కొనసాగుతోందని, ప్రస్తుతం దాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వు కోసమే జీవోను అమలు చేశారన్నారు. కానీ కొందరు కావాలనే టైగర్ జోన్ పేరుతో జిల్లాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళన లకు గురి చేస్తున్నారన్నారు.
టైగర్ కన్జర్వేషన్ రిజర్వుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఏ ఊరు ఖాళీ చేయించమని, హక్కుల పత్రాలు ఉన్నవారు యధావిధిగా భూములు సాగు చేసుకోవచ్చని ఆయన వివరించారు. గిన్నేదరి. జోడేఘాట్ అటవీ ప్రాంతంలో 2012 నుంచి టైగర్ రిజర్వుగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఏ విధమైన అటవీ నిబంధనలు అమలవుతున్నాయో అవే అమలవుతాయన్నారు. టైగర్ రిజర్వుపై కొందరికి అపోహలు ఉన్నాయని, దీనివల్ల ఎలాంటి నష్టం కలగదన్నారు. ఎకో టూరిజం ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. టైగర్ రిజర్వు పై జిల్లా ప్రజలు ఎలాంటి అనుమానాలు ఉన్న అటవీ శాఖ ను సంప్రదించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.






