బీమ‌న్న‌గుట్ట వ‌ద్ద ఆవుపై పులి దాడి

by Nallavelli.Anjaneyulu |

దిశ, జన్నారం : జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి శివారు ప్రాంతంలో ఉన్న అడవిలో ఆవుపై పులి దాడి చేసింది. భీమన్న గుట్ట సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆవు మృతదేహం కనిపించడంతో

బీమ‌న్న‌గుట్ట వ‌ద్ద ఆవుపై పులి దాడి
X

దిశ, జన్నారం : జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి శివారు ప్రాంతంలో ఉన్న అడవిలో ఆవుపై పులి దాడి చేసింది. భీమన్న గుట్ట సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆవు మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఆవును గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. పులి దాడి చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై అటవీ అధికారులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి చలనం పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దాడి వివరాలపై అటవీశాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Next Story