గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు

by Ratna Kumari |

దిశ‌, మంద‌మ‌ర్రి : గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్ అయ్యారు. వారి వ‌ద్ద 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘ‌ట‌న మంద‌మ‌ర్రి పోలీస్ స్టేష‌న్

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
X

దిశ‌, మంద‌మ‌ర్రి : గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్ అయ్యారు. వారి వ‌ద్ద 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘ‌ట‌న మంద‌మ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజ‌శేఖ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాగ‌జ్ న‌గ‌ర్ నుంచి ముగ్గురు వ్యక్తులు గంజాయిని తీసుకొని వస్తున్నారని పక్కా సమాచారం మేరకు సిబ్బందితో క‌లిసి త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ఈ తనిఖీలలో ద్విచక్ర వాహనం పై, స్కూటీ పై వస్తున్నా ముగ్గురు వ్యక్తుల నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. అరెస్ట్ అయిన వారిలో మంద‌మ‌ర్రి మండ‌ల ప‌రిధిలోని పొన్నాం గ్రామానికి చెందిన వేల్పుల వ‌ర్షిత్(21), ఆదిల్ పేట గ్రామానికి చెందిన వేల్పుల రాహుల్ (21), మంచిర్యాల మండ‌లం న‌స్పూర్ గ్రామానికి చెందిన మ‌నిదీప్ (21)లు ఉన్నారు. వీరు ముగ్గురు కాగ‌జ్ న‌గ‌ర్ కి చెందిన ఓ వ్య‌క్తి వ‌ద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి వీళ్లు నివ‌సించే ప్రాంతంలో అమ్మ‌డానికి, వారి వ్య‌క్తిగ‌త వినియోగానికి తీసుకొస్తుండ‌గా ప‌ట్టుబ‌డ్డారు. సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే ఉద్దేశంతో వీరు నేరాల‌కు పాల్ప‌డిన‌ట్టు విచార‌ణ‌లో ఒప్పుకున్నారు. మాద‌క ద్ర‌వ్యాలకి సంబంధించిన నేరాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చ‌రించారు ఎస్ఐ రాజ‌శేఖ‌ర్. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు రాము, రాజేశ్వరరావు, సయ్యద్ మహమ్మద్ లను బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ అభినందించారు.

Next Story