- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హట్‌నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

దిశ, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా బజార్‌హట్‌నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బందోబస్తును మొత్తం 9 సెక్టార్లుగా విభజించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథి హెలిప్యాడ్, కాన్వాయ్, రూట్ బందోబస్తు, మీటింగ్ ప్రాంగణం, ఎంట్రీ పాయింట్లు, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బాంబు స్క్వాడ్ బృందాలతో కూడిన పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్కింగ్ విషయంలో టూ వీలర్లు, ఆటోలు, కార్లు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
భారీ వాహనాలు, బస్సులు కూడా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని తెలిపారు. సోమవారం నుంచి పిప్రి గ్రామం వరకు వన్‌వే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా నిర్మల్ నుంచి వచ్చే వాహనాలు బోత్ ఎక్స్ రోడ్డు మీదుగా బజార్‌హట్‌నూర్ చేరుకుని సభా స్థలానికి రావాలని సూచించారు. ఆటోలు, టూ వీలర్లు ఇచ్చోడ బస్టాండ్ మీదుగా దిగ్నూర్, గంగాపూర్, లక్ష్మీ నాయక్ తండా మార్గంలో సభా స్థలానికి చేరుకోవాలని తెలిపారు. ఈ బందోబస్తులో 3 మంది అదనపు ఎస్పీలు, 5 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 51 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, 112 మంది మహిళా సిబ్బంది, 120 మంది ప్రత్యేక పార్టీ పోలీసు సిబ్బంది, సాయుధ పోలీసు బలగాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, ఏఎస్పీలు పి. మౌనిక ఐపీఎస్, రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్. జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






