- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నానమ్మ మృతితో అనాథలైన ముగ్గురు చిన్నారులు
పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన ఎర్రబాయి శుక్రవారం అనారోగ్యం కారణంగా చనిపోగా.. తన ముగ్గురు మనవళ్లు శివ, రామ్, శ్యామ్ అనాథలు అయ్యారు.

దిశ, బైంసా: పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన ఎర్రబాయి శుక్రవారం అనారోగ్యం కారణంగా చనిపోగా.. తన ముగ్గురు మనవళ్లు శివ, రామ్, శ్యామ్ అనాథలు అయ్యారు. కొన్నేళ్ల క్రితం శివ, రామ్, శ్యాం తండ్రి మరణించగా, రెండేళ్ల కింద తల్లి మరణించింది. దీంతో ఆ ముగ్గురు పిల్లల్ని నానమ్మ ఎర్రబాయి సాకుతూ ఆలనా, పాలన చూసింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న నాన్నమ్మ చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారు. అనాథలుగా మారిన చిన్నారులను చూస్తూ కాలనీవాసులు అయ్యో ఇలాంటి కష్టం పగవాళ్లకు సైతం రాకూడదు అంటూ కంటనీరు పెట్టుకుంటున్నారు. అయితే ఈ చిన్నారుల తండ్రి గతంలో హోమ్‌గార్డుగా విధులు నిర్వహించేవారని, నిర్ణీత ఏజ్ వచ్చిన క్రమంలో ఆ హోంగార్డ్ ఉద్యోగం పెద్ద కుమారుడు శివకి ఇస్తే, అన్నదమ్ములకు ఊరటగా ఉంటుందని కాలనీవాసులు భావిస్తున్నారు.






