టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దోషులను కఠినంగా శిక్షించాలి..

by Disha Web |
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దోషులను కఠినంగా శిక్షించాలి..
X

దిశ, నేరడిగొండ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దోషులను కఠినంగా శిక్షించాలని, చైర్మన్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నేరడిగోండ మండల నిరుద్యోగుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం నినాదాలు చేస్తూ అక్కడి నుండి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వో కు మెమొరాండం అందజేసారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్ల పైకి రావడం సిగ్గుచేటని, నోటిఫికేషన్ల కోసం, ఫలితాల విడుదల కోసం, ఫలితాలలో తప్పుల సవరణ కోసం ఇలా ప్రతి చిన్న అంశం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొందని ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రాన్ని రావణకాష్టంగా తయారు చేశారని అన్నారు.

ఇంత జరుగుతున్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఈ ఘటన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి నేరడిగొండ మండల భారతీయ జనతా పార్టీ తమమద్దతును తెలియజేసి వారితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల నిరుద్యోగులు, యువకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.Next Story