- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భైంసాః నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కమలా థియేటర్ ప్రాంగణంలో చైన్ స్నాచింగ్ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం పట్టణంలోని గోకుల్ నగర్ కి చెందిన ఓ మహిళ కమలా థియేటర్ పక్కన గల రహదారిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ క్రమంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆమె మెడలో నుంచి బంగారు చైన్ ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ మహిళ ప్రతిఘటించింది. దాంతో మొత్తం గొలుసులో సగం మాత్రం దుండగుల చేతికి చిక్కింది. ఆమె కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. మొన్నటికి మొన్న రాహుల్ నగర్ లో సైతం చైన్ స్నాచింగ్ ఘటన మరువకముందే నేడు మరో ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు కొద్దిమేరా భయబ్రాంతులకు గురవుతున్నారు.
Next Story






