ఖానాపూర్ వైన్స్ లో దొంగల హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

తన వసస్తువులు కాపాడ‌టానికి ప్రతి ఒక్క‌రూ ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

ఖానాపూర్  వైన్స్ లో దొంగల హ‌ల్ చ‌ల్
X

దిశ, ఖానాపూర్ : తన వసస్తువులు కాపాడ‌టానికి ప్రతి ఒక్క‌రూ ప్ర‌య‌త్నం చేస్తుంటారు. పోలీసులు కూడా అదే విషయం ప్రతి ఒకరికి అవగహన కలిపిస్తూ తమ తమ సముదాయంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచనలు చేస్తున్నారు. కానీ దొంగలు మాత్రం సీసీ కెమెరాలకు చిక్కకుండా తన వైన్స్ లో దొంగ తనం చేశారు. ఈ ఘ‌ట‌న నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద దినేష్ వైన్స్ లో చేటు చేసుకుంది. పట్టణం లోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దినేష్ వైన్స్ షట్టర్ తాళాలు పగులగొట్టి, గడ్డపారతో పైకి ఎత్తి లోనికి చొరబడ్డాడు. లోపల క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు, 6 బ్లాక్& వైట్ పుల్ బాటిల్స్ ఎత్తుకెళ్లాడు. కౌంటర్ లో ఉన్న దాదాపు రూ. 50 వేల నగదు దొంగిలించాడని, చిరిగిన నోట్లను కూడా ఎత్తుకెళ్ళాడని నిర్వహకులు తెలిపారు. దొంగ నలుపు డ్రెస్ ధరించి, మంకీ క్యాప్ పెట్టుకొని, బయటకు కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. వైన్స్ లోపల దొంగ చోరి చేసింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వాటిని పోలీసులు పరిశీలించి.. విచార‌ణ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రాహుల్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story