- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొల్లపల్లి మండలంలో దొంగల బీభత్సం
జాతరకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి ఇల్లును గుల్ల చేసిన ఘటన గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, గొల్లపల్లి : జాతరకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి ఇల్లును గుల్ల చేసిన ఘటన గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన చుక్క మమత సోమవారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి పెంబట్ల గ్రామంలోని దుబ్బ రాజ రాజేశ్వర స్వామి జాతరకు వెళ్లారు. అయితే వీరు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని దొంగలించినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.
Next Story






