దేవాలయాల్లో దొంగతనం చేసిన దొంగల అరెస్ట్

by Bhanu |   (  Updated:2025-05-07 16:31:50  IST  )

కాగజ్ నగర్ పరిధిలోని మూడు దేవాలయాల్లో జరిగిన దొంగతనాలు కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేసినట్లు కాగజనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

దేవాలయాల్లో దొంగతనం చేసిన దొంగల అరెస్ట్
X

దిశ కాగజ్ నగర్ రూరల్: కాగజ్ నగర్ పరిధిలోని మూడు దేవాలయాల్లో జరిగిన దొంగతనాలు కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేసినట్లు కాగజనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. నిందితులు:1. త్రిదండపాణి అనిల్ కుమార్ (26) - కూలీ, హనుమంతునిపేట, పెద్దపల్లి 2. పైడి అజయ్ (23) - మెకానిక్, రాంపల్లి, పెద్దపల్లి (పరారీలో ఉన్నాడు) 3. బాణాల లక్ష్మణ్ (42) - జువెల్లరీ షాప్, పెద్దపల్లి దొంగతనానికి ఉపయోగించిన విధానం:

2025 మే 2న రాత్రి పెద్దపల్లి నుండి కాగజ్ నగర్ చేరుకుని, బోర్లకుంట, భటపల్లి, కాఘజనగర్ టౌన్‌లోని మూడు హనుమాన్ దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి వెండి కిరీటాలు, మకుటాలు, హారాలు, నామాలు, బంగారు పుస్తెలతాడు తదితర విలువైన వస్తువులు చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వీటిని బాణాల లక్ష్మణ్‌కి అమ్మి రూ.2 లక్షలు తీసుకున్నారు.

నిందితుడు అనిల్ కుమార్ పై పాత కేసులు:

వెల్గటూర్, రామగిరి, మల్యాల, ధర్మారం, వీణవంక, సుల్తానాబాద్, పోతకపల్లి, వేములవాడ, పెద్దపల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత కేసులు:

దహేగాం, కాఘజనగర్ రూరల్, కాఘజనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

పోలీసుల అభినందనలు:

ఈ కేసు ఛేదనలో భాగస్వామ్యమైన కాఘజనగర్ రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సందీప్ కుమార్, పీఎస్‌ఐ సర్తాజ్ పాషాను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ రామానుజం అభినందించారు.

పోలీసుల సూచనలు:

వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో నగలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు పోలీసులకు లేదా పక్కవారికి తెలియజేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయాలి.

Next Story