- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీలో కష్టపడినా వారికి పదవులు రావాలి: మంత్రి జూపల్లి
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎంఎన్ఆర్ గార్డెన్‌లో శుక్రవారం రోజు మంచిర్యాల జిల్లా స్థాయి కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

దిశ, రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎంఎన్ఆర్ గార్డెన్‌లో శుక్రవారం రోజు మంచిర్యాల జిల్లా స్థాయి కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా హాజరైన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావాద్‌కు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వాగతం పలికారు. జిల్లాలో ఎంపికైన కాంగ్రెస్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక పక్కా అమలు చేస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షమ పథకాలు అమలు మాత్రం లబ్ధిదారులకు చేకూర్చుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం బిఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి కూడా చేపట్టలేదు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు రావాలి పార్టీ గుర్తింపు ఇస్తుంది అన్ని జూపల్లి అన్నారు.
పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...
కాంగ్రెస్ నిర్బంధ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ స్వలాభాలు కోసం అప్పుల కుప్పగా మార్చారు. కేసీఆర్ హయాంలో లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నాడు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇపుడు దాని ఊసే లేదు. శ్రీ రామచంద్రుడు బీజేపీ జాగీరా మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడిపుడే నూతన కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీ ని గాడిలో పెడతామన్నారు. అదే విధంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గత పదెండ్లలో బిఆర్ఎస్ రాష్ట్రాని అప్పులకుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి అని గడ్డం వివేక్ అన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ మరోసారి స్రైట్ ఫార్వర్డ్..
ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఎన్నికల ముందు వచ్చిన వారిని అందలం ఎక్కిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం.. కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ను విస్మరిస్తే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని కుండబద్దలు కొట్టాడు. పదేండ్లు అధికారంలోకి రాకున్నా కేసులు అయిన పార్టీని పట్టుకొని కార్యకర్తలు అలానే ఉన్నారు అని తనదైన శైలిలో ప్రేమ్ సాగర్ రావు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జిల్లా నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






